తెలంగాణ

​రేపు మంచిర్యాలలో జనసేన పార్లమెంట్ స్థాయి సమావేశం

  *​భారీగా తరలిరావాలని డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ పిలుపు ​మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ అధ్యక్షతన బుధవార…

By · · Updated

Share this article
​రేపు మంచిర్యాలలో జనసేన పార్లమెంట్ స్థాయి సమావేశం

 

*​భారీగా తరలిరావాలని డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ పిలుపు

​మంచిర్యాల:

మంచిర్యాల జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ అధ్యక్షతన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దుంపటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు మంచిర్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

​ఈ మీడియా సమావేశంలో పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్లు మంతెన సంపత్, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు మూల హరీష్ గౌడ్, శివ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు మంచిర్యాల జిల్లా నాయకులు నల్లతీగల మహేష్, వడ్లకొండ జీవన్, విష్ణు, రమేష్, రక్షిత్, సుధాకర్, సాగర్, పవన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Tags: