తాజా వార్తలు

రేపు ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు By Lakavath Sudhir ఇల్లందు, అక్టోబరు 19 (తెలంగాణ గళం): రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఇల్లందు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.…

By · · Updated

Share this article
రేపు ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు

By Lakavath Sudhir

ఇల్లందు, అక్టోబరు 19 (తెలంగాణ గళం): రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఇల్లందు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాలు, దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

మంత్రి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. సాయంత్రం 4 గంటలకు జేకే కాలనీలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, మినీ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. 4.40 గంటలకు గోవింద్‌ సెంటర్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 5 గంటలకు తిలక్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరవుతారు. 6 గంటలకు మేడికుంట నుంచి రామచంద్రాపురం పీఆర్‌ రోడ్డు వరకు వాగుపై నిర్మించిన హైలెవల్‌ వంతెనను ప్రారంభిస్తారు. సాయంత్రం 6.40 నుంచి రాత్రి 7.25 గంటల వరకు ఎస్‌సీసీఎల్‌ అతిథిగృహంలో ఉంటారు. రాత్రి 7.30 గంటలకు గోవింద్‌ సెంటర్‌లోని ఫారెస్ట్‌ గ్రౌండ్‌లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో పాల్గొంటారు. మంత్రి వ్యక్తిగత సహాయకుడు కేవీకే రాఘవరావు ఈ మేరకు పర్యటన వివరాలను వెల్లడించారు.

Tags: