అభివృద్ధి పనులకు శ్రీకారం.. దసరా వేడుకల్లో పాల్గొననున్న మంత్రి
By Lakavath Sudhir
ఇల్లందు, అక్టోబరు 19 (తెలంగాణ గళం): రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఇల్లందు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాలు, దసరా వేడుకల్లో పాల్గొననున్నారు.
సాయంత్రం 4 గంటలకు జేకే కాలనీలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, మినీ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. 4.40 గంటలకు గోవింద్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 5 గంటలకు తిలక్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. 6 గంటలకు మేడికుంట నుంచి రామచంద్రాపురం పీఆర్ రోడ్డు వరకు వాగుపై నిర్మించిన ఎత్తిపోతల వంతెనను ప్రారంభిస్తారు. సాయంత్రం 6.40 నుంచి రాత్రి 7.25 గంటల వరకు ఎస్‌సీసీఎల్ అతిథిగృహంలో ఉంటారు. రాత్రి 7.30 గంటలకు గోవింద్ సెంటర్‌లోని ఫారెస్ట్ గ్రౌండ్‌లో నిర్వహించే దసరా ఉత్సవాలకు హాజరునవనున్నారు.





