తాజా వార్తలు

రామచంద్రారెడ్డి నగర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు.. విజేతలకు వెండి పాత్రలు బహూకరణ

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసుల కోరిక మేరకు తాజా మాజీ కార్పొరేటర్ గారు తన వంతు సహాయంగా ఉత్తమ…

By · · Updated

Share this article
రామచంద్రారెడ్డి నగర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు.. విజేతలకు వెండి పాత్రలు బహూకరణ

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసుల కోరిక మేరకు తాజా మాజీ కార్పొరేటర్ గారు తన వంతు సహాయంగా ఉత్తమ మూడు బతుకమ్మలకు వెండి పాత్రలను బహుమతులుగా స్పాన్సర్ చేశారు.

ఈ పోటీల్లో మొదటి ఉత్తమ బతుకమ్మగా నిలిచిన ఉషారాణి గారికి 6 తులాల వెండి పాత్ర, రెండవ ఉత్తమ బతుకమ్మగా నిలిచిన మల్లిక గారికి 4 తులాల వెండి పాత్ర, మూడవ ఉత్తమ బతుకమ్మగా నిలిచిన కల్యాణి గారికి 2 తులాల వెండి పాత్రను అందజేశారు.

బహుమతుల పంపిణీ అనంతరం కాశీ విశ్వనాథ క్షేత్రంలో నిర్వహించే గంగా హారతి పురోహితుల చేత గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులు, మహిళలు బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.