తెలంగాణ

రామచంద్రపురంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు

రామచంద్రపురం గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. మందుముల శ్రీనివాస్ నగర్ కాలనీలో పీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరు…

By · · Updated

Share this article
రామచంద్రపురంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు

రామచంద్రపురం గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. మందుముల శ్రీనివాస్ నగర్ కాలనీలో పీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు బతుకమ్మలను అందంగా అలంకరించి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

Tags: