విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం పట్టణ, గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మందుముల శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ ఆవరణంలో ఘనంగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు.
రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో తన స్వచ్ఛంద సంస్థ పీఎన్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సండే మార్కెట్ ఆవరణం విద్యుత్ దీపాల అలంకరణతో కళకళలాడగా, బాణసంచా వెలుగులు దసరా సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కార్యక్రమానికి ముందు మందుముల శ్రీనివాస్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ ఐదు గుళ్ల పోచమ్మ తల్లి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జమ్మి పూజలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా గాంధీ బాలవిహార్ పార్క్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.





