పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న బీజేపీ నేతలు
పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 22:
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు.
సమాజ సేవలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, బెజ్జంకి పూర్ణచారి, పట్టణ ప్రధాన కార్యదర్శులు సంఘ పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి, నాయకులు బాసాని సోమరాజు, కక్కు రాజు, మెంతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క యూనిట్ రక్తం.. మరొకరికి ప్రాణదానం!
రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అందక ఇబ్బందులు పడుతున్న వారికి రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మానవత్వమే ధర్మం.. సేవే లక్ష్యం! అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా రక్తదాన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.






