పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 08:
ప్రతి ఓటరు తమ ఓటును కాపాడుకునే బాధ్యతతో ‘సర్’ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని పరకాల మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.
మంగళవారం 19వ వార్డు పరిధిలోని 46, 47 బూత్‌లలో సర్ ప్రోగ్రాం గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓటర్లకు అందజేసిన నోటీసులకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలని సూచించారు.

తమ గుర్తింపును ధ్రువీకరించే ఏదైనా ఒక గుర్తింపు కార్డును సంబంధిత బీఎల్ఓకు అందజేస్తే ఓటు భద్రంగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లను కూడా కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని కోరారు. అందువల్ల నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు వాటికి సకాలంలో సమాధానం ఇచ్చి ‘సర్’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పవన్, డీటీ సుమన్, ఆర్‌ఐ దామోదర్, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒంటేరు శ్రవణ్ కుమార్, బీఎల్ఓలు సునీత, మల్లికాంబ, బీఎల్ఏలు దుప్పటి రాజేష్, ఎండీ షఫీ, అర్జున్, సతీష్తో పాటు 19వ వార్డు ప్రజలు, 46, 47 బూత్‌ల ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






