ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా ప్రాణత్యాగం..
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం
పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించిన ఎస్ఐ వీరభద్రరావు
పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 21:
ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్ఐ వీరభద్రరావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరుల సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల రక్షణే లక్ష్యంగా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ, దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల సేవలను స్మరించుకుంటామని తెలిపారు. అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, వారి కుటుంబాల త్యాగాలు కూడా వెలకట్టలేనివని అన్నారు.
పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రతి
ఒక్కరూ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాలని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్ఐ వీరభద్రరావు కోరారు.






