తెలంగాణ

పెళ్లి చేసుకోవాలని వేధింపులు.యువతి ఆత్మహత్య! దామెర మండలంలో విషాద ఘటన

నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దామెర పోలీసులు పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 23: హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఓ…

By · · Updated

Share this article
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.యువతి ఆత్మహత్య! దామెర మండలంలో విషాద ఘటన

నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దామెర పోలీసులు

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 23:

హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తూ, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన కట్ట స్నేహ (22), తండ్రి ఎల్లయ్యను అదే గ్రామానికి చెందిన జీడిమెట్ల శ్రీధర్‌ గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన స్నేహ శుక్రవారం (అక్టోబర్ 23) తెల్లవారుజామున ఇంటికి సమీపంలో ఉన్న నల్లాల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న దామెర ఎస్సై వీరభద్రరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఫిర్యాదు స్వీకరించి, పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి కట్ట ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల శ్రీధర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Tags: