తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను పటాన్‌చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు మరియు నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు.
ఈ నెల 18వ తేదీ, ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకలకు నియోజకవర్గంలోని మహిళలు, ఆడపడుచులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. భక్తులకు, తరలివచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు నేతలు తెలిపారు.





