తెలంగాణంగా గళం,హనుమకొండ(సెప్టెంబర్ 20):
పర్వతగిరి మండల కేంద్రంలో గుడిపంపు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గుడిపంపు యూత్ సభ్యులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ మెడిసిటీ రాములు ముఖ్య అతిథిగావిచ్చేశారు.ముందుగా ఆయన వినాయకుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడిసిటీ రాములు మాట్లాడుతూ.. వినాయకుని కృపాకటాక్షాలతో మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
యువత ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోనే విజయలక్ష్మి సంపత్, గంగాధర్ రావు, జాటోత్ శ్రీనివాస్ నాయక్, జూలపల్లి సురేందర్రావు, దేవేందర్రావు, వెంకటేశ్వరరావు, సుధాకర్ రావు, కొండ వెంకటేశ్వర్లు, సోమేశ్వరరావు, అశోక్, చింతకుంట్ల కిష్టయ్య, గుడిపంపు యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ :మోడెమ్ సందీప్, హనుమకొండ.





