తెలంగాణ గళం, పర్వతగిరి, అక్టోబర్ 11:
పర్వతగిరి మండలంలో గత కొన్నేళ్లుగా విధులు నిర్వర్తించి, ఇటీవల వర్ధన్నపేటకు బదిలీపై వెళ్తున్న సబ్ ఇన్స్పెక్టర్ (SI) భోగం ప్రవీణ్‌కు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఆదివారం మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు ఆధ్వర్యంలో ఎస్సై ప్రవీణ్‌ను పూలమాలవేసి, శాలువాతో సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు మాట్లాడుతూ.. ఎస్సై ప్రవీణ్ పర్వతగిరి మండలంలో ఎంతో కర్తవ్య దీక్షతో, ఎలాంటి వివాదాలకు తావులేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించారని కొనియాడారు.
ప్రజలతో మమేకమై శాంతిభద్రతల పరిరక్షణకు విశేష కృషి చేశారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, త్వరలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) పదోన్నతి పొంది తిరిగి పర్వతగిరికే రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్యాక్స్ వైస్ ఛైర్మన్ సందేల నవీన్, జిల్లా పరిషత్ మాజీ సభ్యులు సర్వర్, పాత్రికేయులు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.






