తెలంగాణ గళం, సెప్టెంబర్ 8
పరకాల నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు తాము ప్రెస్, రిపోర్టర్ అంటూ చెప్పుకుంటూ అక్రమ మొరం, ఇసుక దందాలు నిర్వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐడీ కార్డు అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరిస్తూ, ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు రిపోర్టర్ గా చలామణి అవుతూనే మరోవైపు రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు దృష్టి సారించి, నిజమైన జర్నలిస్టుల పరువు తీసే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ ఇసుక , మొరం దందాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






