తెలంగాణ

పరకాలలో ఘనంగా చెన్నకేశవ స్వామి రథయాత్ర

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 20: దసరా వేడుకల్లో భాగంగా చెన్నకేశవ స్వామి రథయాత్రను కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బ్రాహ్మణ వీధి నుంచి కుంకుమేశ్వరాలయం వరకు రథయాత్ర సాగింది. స్వామివారిని దర్శించుకునే…

By · · Updated

Share this article
పరకాలలో ఘనంగా చెన్నకేశవ స్వామి రథయాత్ర

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 20:

దసరా వేడుకల్లో భాగంగా చెన్నకేశవ స్వామి రథయాత్రను కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బ్రాహ్మణ వీధి నుంచి కుంకుమేశ్వరాలయం వరకు రథయాత్ర సాగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. రథయాత్రతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు స్వామివారికి భక్తిపూర్వకంగా మొక్కులు సమర్పించారు.

విజయానికి ప్రతీకగా జమ్మి చెట్టుకు పూజలు

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వేడుకల్లో మరో ముఖ్యాంశంగా నిలిచింది. హిందూ సంప్రదాయంలో జమ్మి చెట్టుకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిపెట్టారని, అజ్ఞాతవాసం ముగిసిన అనంతరం తిరిగి వాటిని తీసుకున్నారని పురాణ కథనం.

Tags: