తెలంగాణ

పరకాలలో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం..!

అమ్మవారి ఊరేగింపులో పోటెత్తిన భక్తజనంప్రత్యేక పూజలు, మహా హారతి అనంతరం నిమజ్జనానికి తరలింపు.. జై దుర్గా నినాదాలతో మార్మోగిన పురవీధులు పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 21: పరకాల పట్టణంలో దసరా నవరాత్రి ఉత…

By · · Updated

Share this article
పరకాలలో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం..!

అమ్మవారి ఊరేగింపులో పోటెత్తిన భక్తజనంప్రత్యేక పూజలు,

మహా హారతి అనంతరం నిమజ్జనానికి తరలింపు..

జై దుర్గా నినాదాలతో మార్మోగిన పురవీధులు

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 21:

పరకాల పట్టణంలో దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భవాని కుంకుమేశ్వర దేవస్థానంలో కొలువైన దుర్గామాత నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. 

అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో పండుగ సందడి నెలకొంది.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు అమ్మవారికి మహా హారతి, పూర్ణాహుతి సమర్పించిన అనంతరం నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు.

డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ దుర్గామాత ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా సాగింది. 'జై దుర్గా.. జై భవాని' నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. 

భక్తులు అమ్మవారికి పూలు, కొబ్బరికాయలు సమర్పించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపు మార్గమంతా భక్తులతో సందడిగా మారింది.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 

తొమ్మిది రోజుల పాటు సాగిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనంతో ముగియడంతో భక్తులు అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Tags: