తెలంగాణ

పరకాలలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు

భూలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజలు.. ఆయుధ పూజలు, బోనాల సమర్పణతో సంప్రదాయబద్ధంగా విజయదశమి వేడుకలు పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 20:* హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని…

By · · Updated

Share this article
పరకాలలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు

భూలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజలు.. ఆయుధ పూజలు, బోనాల సమర్పణతో సంప్రదాయబద్ధంగా విజయదశమి వేడుకలు

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 20:*

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ ఆచారాలు, ప్రత్యేక పూజలతో పట్టణంలో పండుగ సందడి నెలకొంది. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

భూలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజలు.. ఆయుధ పూజలు*

వేడుకల్లో భాగంగా భూలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆయుధ పూజలు చేశారు. అనంతరం దసరా సంప్రదాయంలో భాగంగా సొరకాయ కొట్టి, గొర్రెపిల్లలను బలి ఇచ్చారు. గొర్రెపిల్లల నెత్తురుతో బొట్లు పెట్టుకుని పరకాల ప్రజలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయ ఆచారాలను కొనసాగించారు. పలు ప్రాంతాల్లో బోనాలను సమర్పిస్తూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు.

బ్రాహ్మణ వీధి నుంచి కుంకుమేశ్వరాలయం వరకు అమ్మవారి ఊరేగింపు*

విజయదశమి వేడుకల్లో భాగంగా పరకాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి నుంచి కుంకుమేశ్వరాలయం వరకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపుతో పట్టణంలోని వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Tags: