తెలంగాణ

పరకాల 20, 21వ వార్డులలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ సునీల్

తెలంగాణ గళం, సెప్టెంబర్ 8 పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ ఈరోజు ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని 20, 21వ వార్డులలో పర్యటించారు.   ఈ సందర్భంగా వార్డులలోని డ్రైనేజీ, తాగునీటి సమస్యలు, రోడ్లు, ప…

By · · Updated

Share this article
పరకాల 20, 21వ వార్డులలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ సునీల్

తెలంగాణ గళం, సెప్టెంబర్ 8

పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ ఈరోజు ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని 20, 21వ వార్డులలో పర్యటించారు.

 

ఈ సందర్భంగా వార్డులలోని డ్రైనేజీ, తాగునీటి సమస్యలు, రోడ్లు, పారిశుధ్య పనులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల పేరుకుపోయిన చెత్త, నిలిచిపోయిన డ్రైనేజీలను వెంటనే శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

 

పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చైర్మన్ సునీల్ తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక 20వ వార్డు కౌన్సిలర్ పాలకుర్తి శ్రీనివాస్,21 వ వార్డు కౌన్సిలర్ సుధమల్ల రమేష్ మున్సిపల్ కౌన్సిలర్స్ కొయ్యాడా శ్రీనివాస్, బండి శ్రీధర్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ,సమన్వయ కమిటీ సభ్యులు ఏకు విద్యాసాగర్,మేరుగు శ్రీశైలం,బొచ్చు సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: