తెలంగాణ

పరకాల శివాలయంలో నాగూర్ల వెంకన్న ప్రత్యేక పూజలు

రైతులు సుభిక్షంగా ఉండాలని, పరకాల మరింత అభివృద్ధి చెందాలని స్వామివారికి ప్రార్థన పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 19:  పరకాల పట్టణంలోని పురాతన శివాలయాన్ని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర…

By · · Updated

Share this article
పరకాల శివాలయంలో నాగూర్ల వెంకన్న ప్రత్యేక పూజలు

రైతులు సుభిక్షంగా ఉండాలని, పరకాల మరింత అభివృద్ధి చెందాలని స్వామివారికి ప్రార్థన

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 19: 

పరకాల పట్టణంలోని పురాతన శివాలయాన్ని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న సోమవారం దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, రైతులు పాడిపంటలతో ఆనందంగా జీవించాలని, పరకాల ప్రాంతం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు నాగూర్ల వెంకన్నకు తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పరకాల మండల ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags: