వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి
పరకాల తెలంగాణ గళం, అక్టోబర్ 22:
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వార్డులోని సీఎస్ఐ అంబేద్కర్ విగ్రహం నుంచి సైడ్ డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను ఒకటో వార్డు కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు. వార్డులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టి, వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సీ విభాగం అధ్యక్షుడు బొమ్మకంటి చంద్రమౌళి, బీఆర్ఎస్ పార్టీ వార్డు నాయకులు ఒంటేరు శరత్ బాబు, మంద సురేష్, ఒంటేరు అశోక్, మంద నరేష్, ఒంటేరు పరమేష్, బొచ్చు డింపు తదితరులు పాల్గొన్నారు.






