తెలంగాణ

న్యూ MIG-II విద్యుత్ నగర్‌లో ఘనంగా అమ్మవారి పూజ.. పాల్గొన్న BRS నాయకులు

న్యూ MIG-II విద్యుత్ నగర్‌లో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అమ్మవారి పూజా కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు మీరాగం దేవేంద…

By · · Updated

Share this article

న్యూ MIG-II విద్యుత్ నగర్‌లో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అమ్మవారి పూజా కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు మీరాగం దేవేందర్ యాదవ్ గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

​ఈ పూజా కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కమ్మెట శ్రీకాంత్ రెడ్డి గారు, నాగరాజు గారు, అలాగే తెల్లాపూర్ గ్రామ మాజీ BRS పార్టీ అధ్యక్షులు డాకారెడ్డి ఇంద్రా రెడ్డి గారితో పాటు పలువురు స్థానిక నాయకులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించి, అంతా సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

Tags: