ఎర్రగట్టు గుట్ట వద్ద 65వ డివిజన్ నాయీబ్రాహ్మణుల సమావేశం: నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ గళం /హన్మకొండ,(సెప్టెంబర్ 22).
హన్మకొండ జిల్లా 65వ డివిజన్ నాయీబ్రాహ్మణుల నూతన కార్యవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
ఎర్రగట్టు గుట్ట వద్ద నిర్వహించిన డివిజన్ స్థాయి నాయీబ్రాహ్మణుల విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎల్లాపూర్, దేవన్నపేట, చింతగట్టు గ్రామాలకు చెందిన నాయీబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమాజంలోని సభ్యులు మాట్లాడుతూ, నాయీబ్రాహ్మణుల సంక్షేమం, ఐక్యత, మరియు ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజ బలోపేతానికి ఒక బలమైన వేదిక అవసరమని భావించి, అందరి సమక్షంలో 65వ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గ వివరాలు:
గౌరవాధ్యక్షుడు: గడ్డం యాకయ్య
అధ్యక్షుడు: గడ్డం ఉదయ్ కిరణ్
ఉపాధ్యక్షుడు: కొత్తగట్టు శ్రీనివాస్
ప్రధానకార్యదర్శి: గడ్డం శ్రీనివాస్
కోశాధికారి: వంగపల్లి రంజిత్
ప్రచార కార్యదర్శి: కొత్తగట్టు శ్రీధర్
కార్యవర్గ సభ్యులు:వంగపల్లి రమేశ్, నాగవెల్లి రమేశ్, కొత్తగట్టు ప్రభాకర్, కొత్తగట్టు విజేందర్.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని చెప్పారు. నాయీబ్రాహ్మణుల సంక్షేమం, హక్కుల సాధన, మరియు ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. తమ కమిటీ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
హాసన్ పర్తి, మండల రిపోర్టర్ :మోడెం సందీప్.





