తెలంగాణ

నాసిరకం విత్తనాలతో రైతన్నకు కన్నీళ్లే.150 ఎకరాల్లో పంట నష్టం!

ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి బూడిదే.. విక్రమ్ ట్రేడర్స్ ముందు రైతుల ఆందోళన పరకాల, తెలంగాణ గళం ,అక్టోబర్ 28 నాసిరకం వరి విత్తనాలతో పంట నష్టపోయామని ఆరోపిస్తూ రైతులు పరకాల పట్టణంలోని విక్రమ్ ట్రేడర్స్ ద…

By · · Updated

Share this article
నాసిరకం విత్తనాలతో రైతన్నకు కన్నీళ్లే.150 ఎకరాల్లో పంట నష్టం!

ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి బూడిదే.. విక్రమ్ ట్రేడర్స్ ముందు రైతుల ఆందోళన

పరకాల, తెలంగాణ గళం ,అక్టోబర్ 28

నాసిరకం వరి విత్తనాలతో పంట నష్టపోయామని ఆరోపిస్తూ రైతులు పరకాల పట్టణంలోని విక్రమ్ ట్రేడర్స్ దుకాణం ముందు ఆందోళన చేపట్టారు. శాయంపేట మండలానికి చెందిన మూడు గ్రామాల్లో డబ్ల్యూజీఎల్‌ 44 సిద్ధి రకం వరి విత్తనాలు నాసిరకంగా ఉండటంతో సుమారు 150 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎకరానికి సుమారు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టి వరి సాగు చేసినప్పటికీ, ఇప్పటివరకు పంటకు గొలుసు కూడా రాలేదని రైతులు వాపోయారు. నాణ్యమైన దిగుబడి వస్తుందనే ఆశతో సాగు చేపడితే, నాసిరకం విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నామని రైతులు పేర్కొన్నారు. 

తమకు జరిగిన పంట నష్టంపై సంబంధిత అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని, నష్టానికి గల కారణాలను గుర్తించి బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులు తెలిపారు.

Tags: