తెలంగాణ

నడికూడలో నూతన పీహెచ్‌సీ ప్రారంభం!

గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నడికుడ, తెలంగాణ గళం,అక్టోబర్ 26: హనుమకొండ జిల్లా నడికూడ…

By · · Updated

Share this article
నడికూడలో నూతన పీహెచ్‌సీ ప్రారంభం!

గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం:

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

నడికుడ, తెలంగాణ గళం,అక్టోబర్ 26:

హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడంతో నడికూడ మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని అన్నారు.

ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

 ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందేలా అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు.

Tags: