తెలంగాణ

మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు

ఆటపాటలతో సందడి చేసిన మహిళా కౌన్సిలర్లు! తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా పూల పండుగ వేడుకలు.. పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 17: పరకాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్…

By · · Updated

Share this article
మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు

ఆటపాటలతో సందడి చేసిన మహిళా కౌన్సిలర్లు!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా పూల పండుగ వేడుకలు..

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 17:

పరకాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఆటపాటలు, బతుకమ్మ పాటలతో సందడిగా సాగాయి.

ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొని, గునుగు, తంగేడు తదితర రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు, ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని పూల రూపంలో ఆరాధిస్తూ, మహిళలంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఒకరికొకరు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు

ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు, మహిళా సిబ్బంది పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

Tags: