తెలంగాణ

మున్నూరు కాపు ఆధ్వర్యంలో అన్న ప్రసాదం

పరకాలలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద మహోత్సవం ఘనంగా నిర్వహణ పరకాల,తెలంగాణ గళం, సెప్టెంబర్ 21: పరకాల పట్టణంలోని ఆకులవాడలో కొలువైన గణనాథుని ఆశీస్సులతో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నదా…

By · · Updated

Share this article
మున్నూరు కాపు ఆధ్వర్యంలో అన్న ప్రసాదం

పరకాలలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద మహోత్సవం ఘనంగా నిర్వహణ

పరకాల,తెలంగాణ గళం, సెప్టెంబర్ 21:

పరకాల పట్టణంలోని ఆకులవాడలో కొలువైన గణనాథుని ఆశీస్సులతో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నదాన, అన్నప్రసాద మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

 

అన్నదాతలు:పెంచాల వనమాల, సమ్మయ్య, పెంచాల వైష్ణవి, గోపి, ఎతరాజు చంద్రలేఖ, సాయిరాం, ఎతరాజు రాధమ్మ కుటుంబ సభ్యులు.

 

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని సేవించారు..

Tags: