పర్వతగిరి, అక్టోబర్ 11 (తెలంగాణ గళం):
పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రథమ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు పరామర్శించి ఓదార్చారు.
మండల కేంద్రానికి చెందిన బక్కి సంజీవ గుండెపోటుతో మరణించగా, ఆయన కుటుంబాన్ని మేడిశెట్టి రాములు నేరుగా కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే, తుర్కల సోమారం శివారు గుంటూరుపల్లెలో ఇటీవల మరణించిన పున్నం ఎల్లయ్య కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలని, కుటుంబ సభ్యులకు పార్టీపరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ రావు, మాజీ ప్యాక్స్ వైస్ ఛైర్మన్ సందేల నవీన్, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు సర్వర్, కాంటెస్టెడ్ జడ్పీటీసీ జాటూత్ శ్రీనివాస్ నాయక్, మరియు కాంగ్రెస్ నాయకులు గోనె సంపత్, సురేందర్ రావు, కూసం రామచందర్, బొట్ల వెంకన్న, అంతయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.






