తెలంగాణ

మోదీపై ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నిరసన..  పరకాలలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం!

మోదీపై ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నిరసన..  పరకాలలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం! పరకాల బస్టాండ్ సర్కిల్‌లో ఆందోళన.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల ఆగ్రహం   పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 28: ప్రధానమంత్…

By · · Updated

Share this article
మోదీపై ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నిరసన..   పరకాలలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం!

మోదీపై ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నిరసన.. 

పరకాలలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం!

పరకాల బస్టాండ్ సర్కిల్‌లో ఆందోళన.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల ఆగ్రహం

 

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 28:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపు మేరకు బుధవారం పరకాల పట్టణంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బస్టాండ్ సర్కిల్‌లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గాజుల నిరంజన్ మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి పట్ల కనీస గౌరవం పాటించకుండా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, అయితే అవి ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలకే పరిమితం కావాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఖర్గే తన వ్యాఖ్యలపై బాధ్యత వహించాలని, కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో విమర్శలకు స్థానం ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులు మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని ఆయన సూచించారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానమంత్రి పట్ల గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని పేర్కొన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.పి. జయంతి లాల్, పరకాల మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల శ్రీధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంగా పురుషోత్తం, ఉపాధ్యక్షుడు మిడిదొడ్డి నరేష్, నాయకులు వెనిశెట్టి శారద, పిట్ట కిషోర్, దంచనాదుల సత్యనారాయణ, ముత్యాల దేవేందర్, మెంతుల సురేష్, దామ సతీష్, కక్కు రాజు, సల్పల సురేష్, రంతు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: