తెలంగాణ

​మేయర్, డిప్యూటీ మేయర్‌కు పూలే దంపతుల చిత్రపటాల అందజేత

​ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థలో ఏర్పాటు చేయాలి: బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ ​మంచిర్యాల:మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల ఆశయాలను భావితరాలకు అందించడంతో పా…

By · · Updated

Share this article
​మేయర్, డిప్యూటీ మేయర్‌కు పూలే దంపతుల చిత్రపటాల అందజేత

​ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థలో ఏర్పాటు చేయాలి: బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్

​మంచిర్యాల:మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు వారి నిస్వార్థ సేవలను స్మరించుకునేలా ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థల్లో వారి చిత్రపటాలను అధికారికంగా ఏర్పాటు చేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంచిర్యాల నగర మేయర్ మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యలకు వారి అధికారిక కార్యాలయాల్లో పూలే దంపతుల చిత్రపటాలను బీసీ సమాజ్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి బీసీ ప్రజాప్రతినిధి తమ కార్యాలయాల్లో పూలే చిత్రపటాలను ఏర్పాటు చేసుకోవాలని, పూలే దంపతుల ఆశయాలను కేవలం చిత్రపటాలకే పరిమితం చేయకుండా విద్య, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పూలే దంపతుల జీవిత చరిత్ర, విద్యా ఉద్యమం, సామాజిక పోరాటాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

​పూలే దంపతుల చిత్రపటాల ఏర్పాటు సామాజిక న్యాయ సాధన బాధ్యతకు ప్రతీకగా నిలవాలని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా కార్యదర్శి బియ్యాల సత్తయ్య, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట పద్మాదేవి, మంచిర్యాల పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు ఇనవంక నాగలక్ష్మి, గాండ్ల తిలకేశ్వర రాష్ట్ర నాయకులు జక్కం రవీందర్, నాయి బ్రాహ్మణ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రయ్య, మైనార్టీ నాయకులు ఎండి హుస్సేన్, బీసీ సమాజ్ జిల్లా నాయకులు గొల్ల సత్యనారాయణ, పొదిశెట్టి వినోద్, పట్టణ నాయకులు చల్ల విజయ్ కుమార్, తాటిపాముల సమ్మయ్య, పల్లపు శ్రీనివాస్, ముదిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు

Tags: