మెట్‌పల్లిలో శమీ పూజలో పాల్గొన్న విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే సంజయ్
తెలంగాణ గళం,మెట్‌పల్లి రిపోర్టర్:
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మెట్‌పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన శమీ పూజ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ దసరా పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయానికి విచ్చేసిన భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.





