తెలంగాణ

​మంతెన జగన్ మోహన్ రావును కలిసిన నస్పూర్ యూత్ కాంగ్రెస్ శ్రేణులు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావును నస్పూర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు అజయ్ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత…

By · · Updated

Share this article
​మంతెన జగన్ మోహన్ రావును కలిసిన నస్పూర్ యూత్ కాంగ్రెస్ శ్రేణులు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావును నస్పూర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు అజయ్ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారంతా మంతెన జగన్ మోహన్ రావు నాయకత్వంపై తమ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో అంకితభావంతో కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తల రాకతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొనగా, జగన్ మోహన్ రావు వారిని అభినందిస్తూ పార్టీ అభివృద్ధికి అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిల్లా వేణు, మాజీ మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, కార్పొరేటర్లు వనపర్తి రాజేష్, సంజీవ్, సతీష్ రెడ్డి, అశోక్, తేజ తదితర ప్రముఖులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Tags: