మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారి చేతుల మీదుగా మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లు మరియు హాజీపూర్ మండలాలకు చెందిన 286 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1,05,47,100/- విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను స్థానిక ఎమ్మెల్యే గారి నివాసంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయనిధి ఒక ఆపన్నహస్తంగా నిలుస్తోందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, తదితరులతో పాటు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు






