మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు గారికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూస్కూర్ రామ్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ సమావేశం సందర్భంగా రామ్ మోహన్ రావు గారి చొరవతో మరియు హరీష్ రావు గారి సమక్షంలో నస్పూర్ మాజీ కౌన్సిలర్ బండి పద్మ బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరారు. పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, హాజీపూర్ సర్పంచ్ మాధవరావు శ్రీలత రామారావు, డబ్ల్యూసీడీఎస్సీ మంచిర్యాల మాజీ చైర్మన్ అత్తి సరోజ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల శంకర్, మాజీ కౌన్సిలర్లు తాజుద్దీన్, మహమ్మద్ రఫీ, గంగులు, షఫీ, హజీమ్, కంది హరీష్, హాజీపూర్ గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు






