మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించిన హాన్విక..
అభినందించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి!
వైద్య విద్యలో రాణించి పేదలకు సేవలందించాలి..
దామెర, తెలంగాణ గళం అక్టోబర్ 25
పరకాల నియోజకవర్గంలోని దామెర మండల కేంద్రానికి చెందిన గుండా రజిత–శ్రీనివాస్ దంపతుల కుమార్తె హాన్విక మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసించేందుకు సీటు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాన్వికను ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కష్టపడి చదివి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు.
హాన్విక సాధించిన విజయం ఆమె తల్లిదండ్రుల కృషికి, ప్రోత్సాహానికి ప్రతిఫలమని పేర్కొన్నారు.
హాన్విక వైద్య విద్యలో మరింత రాణించి, భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావించాలని సూచించారు.
ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించడం హాన్విక వ్యక్తిగత విజయమే కాకుండా, ఆమె కుటుంబ సభ్యులకు, దామెర గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. హాన్వికను ఆదర్శంగా తీసుకుని ఇతర విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.
తమ కుమార్తె సాధించిన విజయాన్ని గుర్తించి అభినందించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి హాన్విక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






