మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో వైష్ణవి డైరీ ఐదవ పార్లర్‌ను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా మంచిర్యాల ప్రజలకు నిరంతరంగా నాణ్యమైన పాల ఉత్పత్తులను అందిస్తూ అపూర్వ ఆదరణ పొందుతున్న ఈ సంస్థ, తన సేవలను మరింత విస్తరిస్తోంది. పట్టణ ప్రజలకు మరింత చేరువయ్యేలా మరిన్ని ప్రాంతాల్లో పార్లర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైష్ణవి డైరీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గోర్ర తిరుపతి యాదవ్ పాల్గొని మాట్లాడుతూ.. వినియోగదారుల ఆరోగ్యం, నాణ్యతకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. డైరీలో తాజా పాలు, పెరుగు, పన్నీర్, నెయ్యి, వెన్న, మజ్జిగ, లస్సీ వంటి స్వచ్ఛమైన పాల పదార్థాలు నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా అందుబాటులో ఉంటాయని, ప్రజల నమ్మకమే తమ విజయానికి అసలైన బలమని పేర్కొన్నారు






