మంచిర్యాల: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఈరోజు మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పట్టణానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు ప్రజల సమస్యలను తన రచనలు, ఉద్యమాల ద్వారా సమాజంలోకి బలంగా తీసుకెళ్లారని కొనియాడారు. తెలంగాణ సమాజం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, కాళోజీ గారి జీవితం, ఆయన రచనలు నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం (AIMIM) మంచిర్యాల పట్టణ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇబ్ని అఫాన్, మహమ్మద్ సమీర్ తదితర నాయకులు పాల్గొన్నారు






