తెలంగాణ

కష్టకాలంలో కార్యకర్తకు సీఎం చంద్రబాబు భరోసా

నాగేశ్వరరావును పరామర్శించి ధైర్యం.. వంశీ చొరవను అభినందించిన సీఎం ఇల్లందు, సెప్టెంబర్‌ 4 (తెలంగాణ గళం): ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత నాలుగు నెలలుగా చికిత్స పొందుతున్న ఇల్లందు పట్టణం 1వ వార్డు నివాసి…

By · · Updated

Share this article

నాగేశ్వరరావును పరామర్శించి ధైర్యం.. వంశీ చొరవను అభినందించిన సీఎం

ఇల్లందు, సెప్టెంబర్‌ 4 (తెలంగాణ గళం): ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత నాలుగు నెలలుగా చికిత్స పొందుతున్న ఇల్లందు పట్టణం 1వ వార్డు నివాసి బాసాని నాగేశ్వరరావును టీడీపీ నేత ముద్రగడ వంశీ కుటుంబ సభ్యులతో కలిసి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును కలిశారు.

ప్రమాదం జరిగిన అనంతరం నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు ఫోన్‌ ద్వారా తెలుసుకుని పరామర్శించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నాగేశ్వరరావును తన వద్దకు తీసుకురావాలని వంశీకి సూచించారు. చంద్రబాబు సూచన మేరకు వంశీ కుటుంబ సభ్యులతో కలిసి నాగేశ్వరరావును అమరావతికి తీసుకెళ్లి సీఎంను కలిపించారు.

ఈ సందర్భంగా నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ, పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రమాదం అనంతరం నాగేశ్వరరావు చికిత్సను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ముద్రగడ వంశీ చొరవను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన విజయలక్ష్మినగర్‌ సర్పంచ్‌ చాందావత్‌ రమేష్‌బాబును చంద్రబాబు అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కామేపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన అజ్మీర బుజ్జిని కూడా అభినందించారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన విజయలక్ష్మినగర్‌ సర్పంచ్‌ చాందావత్‌ రమేష్‌బాబును చంద్రబాబు అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కామేపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన అజ్మీర బుజ్జిని కూడా అభినందించారు.

తెలంగాణలో టీడీపీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ముద్రగడ వంశీ ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు కారు నర్సన్న, దాసరి గోపాలకృష్ణ, గోగేలా రాజేష్‌, బాసాని సుజాత, బాసాని నవీన్‌, బాసాని సాయి, తమానబోయిన భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: