తెలంగాణ

​కార్తీక మాసంలో శ్రీ వైష్ణవ సంఘ భవనానికి స్థలం కేటాయిస్తాం: ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు

మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులో గల బీఎంఏ (BMA) ఫంక్షన్ హాల్‌లో శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన ‘శ్రీ వైష్ణవ సమారాధాన’ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్…

By · · Updated

Share this article
​కార్తీక మాసంలో శ్రీ వైష్ణవ సంఘ భవనానికి స్థలం కేటాయిస్తాం: ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు

మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులో గల బీఎంఏ (BMA) ఫంక్షన్ హాల్‌లో శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన ‘శ్రీ వైష్ణవ సమారాధాన’ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవలో వైష్ణవ సమాజం ముందుండాలని ఆకాంక్షించారు. సంఘ సభ్యుల విజ్ఞప్తి మేరకు, రాబోయే కార్తీక మాసంలో శ్రీ వైష్ణవ సంఘ భవన నిర్మాణం కోసం స్థలాన్ని తప్పకుండా కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

​ఈ సందర్భంగా వైష్ణవ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, సంఘ బాధ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Tags: