తెలంగాణ

కార్మికుల హక్కుల సాధన కోసం కదలిరండి చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి

కార్మికుల హక్కుల సాధన కోసం కదలిరండి.. చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి! కనీస వేతనం రూ.30 వేలు అమలు చేయాలి.. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి సీఐటీయూ జిల్లా కోశాధికారి బోట్ల చక్రపాణి పిలుపు పరకాల…

By · · Updated

Share this article
కార్మికుల హక్కుల సాధన కోసం కదలిరండి చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి

కార్మికుల హక్కుల సాధన కోసం కదలిరండి.. చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి!

కనీస వేతనం రూ.30 వేలు అమలు చేయాలి.. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

సీఐటీయూ జిల్లా కోశాధికారి బోట్ల చక్రపాణి పిలుపు

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 17

కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి బోట్ల చక్రపాణి పిలుపునిచ్చారు.

పరకాల పట్టణంలోని అమరధామంలో సీఐటీయూ కార్మికుల అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీ, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు పీఆర్సీ ప్రకటించి, కనీస వేతనం రూ.30 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పథకాల అమలులో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని, జీవో నంబర్ 6ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

అలాగే హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు వారికి కాలనీలు నిర్మించాలని, కార్మికుల హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి వివిధ రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ పరకాల మండల నాయకులు బొచ్చు ఆదాం, పి. సమ్మక్క, బయ్య కృష్ణంరాజు, పసుల సారయ్య, చెరుకు వేణు, ఎం. సుధాకర్, బొచ్చు సామెల్, ఒంటె ప్రకాశ్, గూడెల్లి వెంకటేష్, రమేష్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

Tags: