తెలగంగాణ గళం, సెప్టెంబర్ 4
హనుమకొండ జిల్లా ...
కంటాత్మకూర్ గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయం వద్ద ఈ నెల 6, 7, 9 తేదీలలో జరగనున్న పూజా కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్టాపనలు, పునః ప్రతిష్టాపనలు మరియు బోనాల పండుగను సర్పంచ్ కోంగంటి తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా గురువారం పోత లింగన్న పునః ప్రతిష్టాపన మరియు జంట నాగుల విగ్రహ ప్రతిష్టాపనకు సర్పంచ్ కోంగంటి తిరుపతి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తిరుపతి మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన పోతలింగన్న విగ్రహాన్ని పైకి లేపి పక్కన పెట్టడం జరుగుతుందని, 7వ తేదీన పోతలింగన్న పునః ప్రతిష్టాపన మరియు అదే రోజు జంట నాగుల విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుందని, 9వ తేదీన ఉదయం 7 గంటల నుండి గ్రామస్తులంతా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ మహోత్తరమైన కార్యక్రమంలో గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..






