తెలంగాణ

కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన.

గూడూరు అక్టోబర్ 8 (తెలంగాణ గళం) : న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ఇండియా కూటమి చేపట్టిన శాంతియుత మార్చ్‌పై ఢిల్లీ పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధ…

By · · Updated

Share this article
కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన.

గూడూరు అక్టోబర్ 8 (తెలంగాణ గళం) : న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ఇండియా కూటమి చేపట్టిన శాంతియుత మార్చ్‌పై ఢిల్లీ పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులను అక్రమంగా అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ కాంగ్రెస్ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే నిరసన కార్యక్రమాలను నిర్వహించారు ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు భూక్య ఉమా ఆదేశాల ప్రకారం గురువారం గూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు మండల గ్రామ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాల నాయక్ నేతృత్వంలో గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దేశ రాజధానిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసుల బలప్రయోగం చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని,విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గూడూరు మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్ వెంకన్న గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి గూడూరు ఉపసర్పంచ్ చంటి స్వామి మరిమిట్ట సర్పంచ్ పూర్ణచందర్ జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి ఎండి రసూల్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కందిక శంకర్ చిన్న ఎల్లాపురం ఉపసర్పంచ్ వెంకటరామ్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మాలు నాయక్ మాజీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నం వెంకన్న,కరీం,రాములు తండా గ్రామ పార్టీ అధ్యక్షులు సుందర్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు ముత్యం లక్ష్మీనారాయణ వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ పార్టీ అధ్యక్షులు వార్డు మెంబర్లు ఎన్ఎస్యుఐ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు ముఖ్య కార్యకర్తలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Tags: