పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలి.. ప్రజావాణిలో 9 అర్జీల స్వీకరణ
పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 26:
పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని కామారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామ సరిహద్దులు, గ్రామానికి సంబంధించిన వివరాలు, ఇప్పటివరకు నిర్వహించిన సర్వే పురోగతిపై సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
రీ-సర్వే ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. భూముల రీ-సర్వేను పారదర్శకంగా, సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు.
సర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేందుకు రైతులందరూ రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పరకాల మండల తహసీల్దార్ టి. విజయలక్ష్మి, మండల సర్వేయర్ విజయ్ కుమార్, అదనపు గిర్దావర్ ఖయ్యూం, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో 9 అర్జీల స్వీకరణ
అనంతరం పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న పాల్గొని ప్రజల నుంచి 9 అర్జీలను స్వీకరించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన అర్జీలను స్వీకరించి, ప్రజావాణి కార్యక్రమంలో డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.






