గూడూరు సెప్టెంబర్ 9(తెలంగాణ గళం) : గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక కాలయాపన చేయడం సరికాదని సిపిఎస్ రద్దు పరిశీలనకై ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కేవలం కాలయాపన కోసమేనని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆరోపించారు రాష్ట్రంలోని 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత నెల ఆగస్టు 23న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన జన జాగరణ సభకు లక్ష మందికి పైగా ఉద్యోగులు,ఉపాధ్యాయులు హాజరై తమ ఆకాంక్షను చాటారని ఆ ఉద్యమ స్పూర్తిని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని కోరారు.ప్రభుత్వం ఇకనైనా కమిటీలతో సంబంధం లేకుండా సిపిఎస్ రద్దు నిర్ణయాన్ని తక్షణమే ప్రకటించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాలయాపన కమిటీలు వద్దు సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. రవిచంద్ర
గూడూరు సెప్టెంబర్ 9(తెలంగాణ గళం) : గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధ…
By తెలంగాణ గళం · · Updated
Share this article






