హైదరాబాద్, సెప్టెంబర్ 5: జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో నిందితుల రెండో రోజు కష్టపడి విచారణ ప్రారంభమైంది. ఇద్దరినీ రెండు రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో... కోడూరి మీనా కుమారి, వినీల్ చౌదరిలను జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ తల్లి మీనా కుమారి నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు విచారణలో ప్రధాన నిందితుడు అర్జున్ తల్లి మీనా కుమారి పాత్రకు సంబంధించి వివరాలను పోలీసుల సేకరించారు. వారికున్న పరిచయాల నెట్వర్క్, అర్జున్‌కు సహకరించిన ఇతర వ్యక్తులతో ఆమెకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కీలక సమాచారం సేకరించారు. బాధితుల కుటుంబాలను డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 11 రాజస్థాన్‌లో మీనా కుమారి, వినీల్ చౌదరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కస్టడీలో కీలకమైన విషయాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు నేటితో నిందితుల కస్టడి విచారణ ముగియనుంది.






