జన్నారంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అనంతరం ఎల్నినో ప్రభావంపై మాట్లాడుతూ, వాతావరణంలో సంభవించే మార్పులు, వర్షపాతంపై పడే ప్రభావం, వ్యవసాయ రంగానికి ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే గుర్తించి, నీటి వృథాను అరికట్టాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని చెప్పారు. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని, అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని సమష్టి కృషితో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నందు నాయక్, ఫసియుల్లా, మందె రాజేష్, రియాజ్, ఇమ్రాన్, మొహ్సిన్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.




