తెలంగాణ

హసన్పర్తి PACS చైర్మన్‌గా పింగిలి వెంకట్ నరసింహ రెడ్డి, డైరెక్టర్స్ గా జనగాని దయాకర్, నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసారు

హసన్పర్తి PACS చైర్మన్‌గా పింగిలి వెంకట్ నరసింహ రెడ్డి ప్రమాణస్వీకారం తెలంగాణ గళం /హసన్పర్తి, సెప్టెంబర్ 21: హసన్పర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన చైర్మన్‌గా పింగిలి వెంకట్ నరసింహ…

By · · Updated

Share this article
హసన్పర్తి PACS చైర్మన్‌గా పింగిలి వెంకట్ నరసింహ రెడ్డి, డైరెక్టర్స్ గా జనగాని దయాకర్, నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసారు

హసన్పర్తి PACS చైర్మన్‌గా పింగిలి వెంకట్ నరసింహ రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ గళం /హసన్పర్తి, సెప్టెంబర్ 21:

హసన్పర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన చైర్మన్‌గా పింగిలి వెంకట్ నరసింహ రెడ్డి సోమవారం అత్యంత వైభవంగా ప్రమాణస్వీకారం చేశారు. వారితో పాటు సంఘం నూతన డైరెక్టర్లుగా జనగాని దయాకర్, నవీన్ కుమార్ మరియు ఇతర పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని సహకార రంగ ప్రముఖులు, రైతులు, రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన చైర్మన్ వెంకట్ నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందేలా చూస్తామని, PACS అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని స్పష్టం చేశారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, సహకార సంఘం సభ్యులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన డైరెక్టర్లు జనగాని దయాకర్, నవీన్ కుమార్ గార్లను, చైర్మన్‌ను పలువురు నాయకులు, రైతులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

తెలంగాణ గళం :హాసన్ పర్తి న్యూస్ ప్రతినిధి :

మోడెమ్ సందీప్