తెలంగాణ

గూడూరులో కుట్టు మిషన్ల పంపిణీ.

గూడూరు అక్టోబర్ 16 (తెలంగాణ గళం) : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హల్) కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్అర్) నిధుల ద్వారా గూడూరు మండలం అరవింద పాఠశాలలో నిర్వహించిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో…

By · · Updated

Share this article
గూడూరులో కుట్టు మిషన్ల పంపిణీ.

గూడూరు అక్టోబర్ 16 (తెలంగాణ గళం) : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హల్) కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్అర్) నిధుల ద్వారా గూడూరు మండలం అరవింద పాఠశాలలో నిర్వహించిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు సహకరిస్తున్న హల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా సాధికారతకు,నిరుద్యోగ మహిళల అభ్యున్నతికి హల్ అందిస్తున్న సహకారాన్ని అభినందించారు.మహిళలు ఆర్థికంగా ఎదిగి,స్వయం ఉపాధితో గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు,ప్రజాపతినిధులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Tags: