ఆడపడుచులంత కూడి ఆడెదరు అందంగాఇలవేల్పుగా కొలిచి ఇంతులంత ఇష్టంగారంగు రంగు పూలతో రమ్యంగా పూలను పేర్చంగా
బతుకమ్మ వెలుగొందె దేదీప్యమానంగా
ముద్ద బంతి పూలను ముదముగా పేర్చంగా
గునుగు పూలను గుంభనంగా తీర్చంగా
తంగేడు పువ్వులను తలమానికమని కొలవంగా
తీరైన పూలతో తయారవ్వు బతుకమ్మ
గుడిలేని దైవానికి గుమ్మడి పూలతో
బతుకమ్మగా పేర్చేము భక్తిశ్రద్ధలతో
వనితలందరు చేరి వందనాలతో
ఆడిపాడేరు సాయంకాలన చప్పట్లతో
సత్తువిచ్చే ఫలహార సత్తుపిండులతో
సంప్రదాయము తెలిపే పల్లెపాటలతో
బతుకునిచ్చె అమ్మను బతకనివ్వమంటూ
కొలిచి మొక్కేరు కొంగుబంగారమంటూ
పూలనే పూజించె గొప్పపండుగ బతుకమ్మ
అందరొకటేనని చాటిచెప్పు బతుకమ్మ
ఆరోగ్యానికి దారులు వేయునది బతుకమ్మ
సకల సిరులలొసిగే మా తల్లి బతుకమ్మ
*జక్కు కృష్ణమూర్తి గౌడ్*
తెలుగు భాషోపాధ్యాయులు,
ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల కరీంనగర్.
9912328949
9059674541






