గొర్లవీడు గ్రామ ఆడబిడ్డకు ఘన సన్మానం..
పరకాల 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్‌కు బీజేపీ నాయకుల అభినందనలు!
గ్రామానికి చెందిన మహిళ కౌన్సిలర్‌గా ఎన్నికవడం గర్వకారణం.. శాలువాతో సత్కరించిన గొర్లవీడు గ్రామ బీజేపీ నాయకులు
పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 21
పరకాల మున్సిపాలిటీ 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఆకుల లావణ్య శ్రీధర్‌ను గొర్లవీడు గ్రామ బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి బీజేపీ జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు, బీజేపీ నాయకులు నరాల కొమురయ్య, జైపాల్ రెడ్డి ఆమెకు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తమ గొర్లవీడు గ్రామానికి చెందిన ఆడబిడ్డ పరకాల మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజాసేవలో ముందుకు సాగడం తమకు ఎంతో గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ, వార్డు అభివృద్ధితో పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
కౌన్సిలర్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
తమ గ్రామానికి చెందిన లావణ్య శ్రీధర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికవడం గ్రామానికి గర్వకారణమని, ఆమె ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆకాంక్షించారు.






