తెలంగాణ గళం, సెప్టెంబర్ 8
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం పరకాలలో ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చల్లా ధర్మారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు.

అనంతరం పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






